BREAKING
thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 19 July 2026, 05:22 pm
Posted by : కూనురు మధు

డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జునసాగర్ : ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

తెలంగాణ
/ నల్గొండ
19 Jul, 2026 - 05:22 PM
211 వీక్షణలు

డెడ్ స్టోరేజీకి చేరువలో నాగార్జునసాగర్ : ఆందోళనలో ఆయకట్టు రైతాంగం

నాగార్జునసాగర్ జలాశయం పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడం, ఎండల తీవ్రతకు తోడు అవసరాల నిమిత్తం నీటిని వాడటంతో సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వలు ప్రమాదకరంగా పడిపోయి, ప్రస్తుతం డెడ్ స్టోరేజీ స్థాయికి చేరువయ్యాయి. జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పడిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 6.2 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా ఎల్‌ఎన్‌ఎస్‌పీ (లెఫ్ట్ బ్యాంక్ కెనాల్), ఆర్‌బీసీ (రైట్ బ్యాంక్ కెనాల్) కాలువలకు నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సాగర్ నీటిపైనే ఆధారపడి సాగు చేసే నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల రైతుల్లో ఈ పరిస్థితి తీవ్ర గుబులు రేపుతోంది. సాధారణంగా ఈ పాటికే ఖరీఫ్ (వానాకాలం) సాగు పనులు వేగవంతం కావాల్సి ఉండగా, నీటి లభ్యత లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాబోయే రోజుల్లో తగినంతగా వర్షాలు కురవకపోతే ఖరీఫ్ సాగుపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటుతుండటంతో ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తాగునీటి ఎద్దడి రాకుండా చూడటంతో పాటు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాలపైనే ఆశలు

​ప్రస్తుత పరిస్థితుల్లో ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం ప్రాజెక్టుల ద్వారా నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో వస్తేనే సాగర్‌కు మళ్లీ ఊపిరి పోసే అవకాశం ఉంది. లేదంటే ఈ ఏడాది సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని క్షేత్రస్థాయి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి