BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 02 September 2026, 11:06 pm
Posted by : కొత్తపల్లి వినోద్ కుమార్

మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
కొత్తపల్లి వినోద్ కుమార్ కదిరి నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:06 PM
36 వీక్షణలు

తలుపుల మండలంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన బీఎస్ మక్బుల్, డీకే బాబు

కదిరి నియోజకవర్గం | తలుపుల | Ntoday News

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా తలుపుల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బుల్, తలుపుల మండల కన్వీనర్ డీకే బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పాలన, పేదలు, బడుగు–బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల గుండెల్లో మహానేత వైఎస్సార్ స్థానం ఎప్పటికీ చెరగదని పేర్కొన్నారు.

“జోహార్ వైఎస్సార్.. జోహార్ రాజన్న” అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ మహానేతకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.