BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 29 March 2026, 08:40 pm
Posted by : రాఘవేంద్ర

దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పై ఎంపీ పర్యటన

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
Reporter
రాఘవేంద్ర కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధి
29 Mar, 2026 - 08:40 PM
192 వీక్షణలు

దుండిగల్ సర్కిల్ బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటన

మున్సిపల్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన  దుండిగల్,గండి మైసమ్మ, బహదూర్ పల్లి గ్రామాలలో మూడు చోట్ల డబుల్ బెడ్రూంలో సమస్యలపై పర్యటించి  కల్పించిన ఎంపీ ఈటెల రాజేందర్ వారికి భరోసా కల్పించారు.

ఎంపీ ఈటల  మాట్లాడుతూ దుండిగల్ లో డబుల్ బెడ్రూలలో 37 బ్లాక్ లు 4000 కుటుంబాలు 15 వేల పైగా జనాభా అంటే ఒక చిన్న మున్సిపాలిటీ జనాభా ఉందన్నారు.ఇక్కడ ఇండ్లు కేటాయించిన తర్వాత ప్రజలు ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందని తెలిపారు.2bhk వాసుల సమస్యలు ఇప్పటికే ప్రభుత్వం మరియు మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగిందన్నారు.మీరంతా నా దగ్గరికి వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, నేనే మీ దగ్గరికి వచ్చి ఒకసారి సమస్యలు చూస్తానని వచ్చానన్నారు  

ఇక్కడున్నవారు  అందరూ నిరుపేదలే ఎక్కడో పొట్ట చేత పట్టుకొని వచ్చి కూలో నాలో చేసుకుందామంటే ఇక్కడ సరైన పని లేవన్నారు. ఎక్కడో ఉన్న వ్యాపారాలు, ఉద్యోగాలు గాని వదిలి ఇక్కడికి రావడం మళ్ళీ అక్కడ వెళ్లి పని చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.కాబట్టి ఇక్కడ ఏవైతే షెటర్లు ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం బయటి వారికి టెండర్లు పిలుస్తామంటే దానికి తాను ఒప్పుకోలేదన్నారు.అవి  స్థానికులకే కేటాయించాలి ఇక్కడ ఏవైతే అంగన్వాడి ఆశా వర్కర్ ప్రైమరీ స్కూల్, బస్తీ దవాఖాన  ఏర్పాటు చేసి  ఇక్కడి వారికే అందులో ఉద్యోగాలు ఇచ్చేలాగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.ఇక్కడ ఇండ్లు ఇచ్చిన తర్వాత వారికి కావాల్సిన మౌలిక వసతులు మాత్రమే కాకుండా ఇచ్చిన దాంట్లో సరైన క్వాలిటీలు మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.పైన స్లాపులు ఉరువడం పెచ్చులూడి మీద పడుతున్నాయి ఇళ్లలో నీరు వర్షపు నీరు వచ్చి జారిపడుతున్నారన్నారు లిఫ్టులు కొన్ని సంవత్సరాలు రిపేర్ చేసి వారికి అప్ప చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఎస్టీపీలు కూడా సరైన మెయింటెనెన్స్ లేక గల్లీలో మురికి వరదలు పారుతుందన్నారు.ప్రజలు ఉండలేక నానా అవస్థలు రోగాల బారిన  పడుతున్నారు మంచినీరు తాగడానికి లేక ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి మనిషికి 135 లీటర్ల నీళ్లు ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పటికీ పది పైసల వంతు కూడా మీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎంపీ లార్డ్స్ నిధులతో కొన్ని బోర్లు వేయించిన కానీ వారికి ఏమాత్రం సరిపోవు కాబట్టి మిషన్ భగీరథ నీళ్లను తక్షణమే కాలనీకి వచ్చేలా అనేక సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వత్తిడి ద్వారా  ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు 

 ఈ కార్యక్రమం లో మున్సిపల్ బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శిలు డి విగ్నేశ్వర్ చారి, గిరివర్ధన్ రెడ్డి,శ్యామ్ రావు గోనె మల్లారెడ్డి ఏ మల్లేష్ యాదవ్,ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్ , రోజా, శ్రీనివాస్ యాదవ్,భాను గౌడ్ ఆకుల విజయ్,వెంకటేష్ నాయక్, రాజకుమార్ శ్రీధర్ గౌడ్ పెద్ద ఎత్తున ప్రజలు మూడు కాలనీల వాసులు విష్ణువర్ధన్ రెడ్డి దుర్గముదిరాజ్ దుర్గేష్ సురేష్ నాగమణి గణేష్  తదితరులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు