BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 01 June 2026, 07:02 am
Posted by : కూనురు మధు

చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
01 Jun, 2026 - 07:02 AM
363 వీక్షణలు

వారం రోజులుగా బంద్ అయిన వాటర్ ప్లాంట్

* ​ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల్లో విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెంలో తాగునీటి కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. గత వారం రోజులుగా స్థానిక ట్రాన్స్‌ఫార్మర్ పనిచేయకపోవడంతో అటు రైతాంగం, ఇటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని బోరు మోటర్లు నడవక పంటలు వేసే సమయంలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.. అదే కరెంటు కనెక్షన్‌తో నడిచే స్థానిక వాటర్ ప్లాంట్ పూర్తిగా మూతపడింది. ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో నీటి అవసరం విపరీతంగా పెరిగింది. అలాంటిది వారం రోజులుగా వాటర్ ప్లాంట్ బంద్ కావడంతో ఫస్ట్ వార్డు ప్రజలు తాగడానికి  నీరు లేక విలవిలలాడుతున్నారు.  సొంతంగా బండ్లు, వాహనాలు ఉన్నవారు చిట్యాల టౌన్‌కు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటుండగా ఎలాంటి ఆసరా లేని ముసలివాళ్లు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే శక్తి లేక, తాగడానికి నీరు దొరకక ఈ ఎండాకాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ​ఈ తీవ్రమైన సమస్యపై గ్రామ యువకులు, స్థానికులు ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం "చూస్తాం.. చేస్తాం" అంటూ వారం రోజులుగా కాలయాపన చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు మండిపడుతున్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదని స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యుద్ధప్రాతిపదికన కరాబైన ట్రాన్స్‌ఫార్మర్‌ను రిపేర్ చేయించి, వాటర్ ప్లాంట్‌ను పునరుద్ధరించాలి అని  అధికారులు,  ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించకపోతే, ఫస్ట్ వార్డు ప్రజలందరూ మున్సిపల్ ఆఫీస్ ముందు భారీ ధర్నాకు దిగుతామని హెచ్చరించారు మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.