BREAKING
thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులకు భూమా అఖిలప్రియ అభినందనలు thumb ● రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలి thumb ● ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫతేపూర్ వాసి కుటుంబానికి ఆర్థిక సహాయం. thumb ● TUWJ-IJU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పుట్టి మురళి ఎన్నిక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలేకు సుంకరి రంగన్న ఘన నివాళులు thumb ● శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. రూ.207.6 కోట్ల కానుక thumb ● మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వినయ్ రెడ్డి నివాళులు thumb ● తిరుమల శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి విలువైన బంగారు ఆభరణాల సమర్పణ thumb ● పతేపూర్‌లో శ్రీ మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ
Test 4
Date of Publish : 28 November 2026, 03:34 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

బాలానగర్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
28 Nov, 2026 - 03:34 PM
16 వీక్షణలు

బాలానగర్: బహుజన తాత్వికుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సంఘం సభ్యులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన, ముఖ్యంగా మహిళా విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. కుల, మత, సామాజిక అసమానతలను తొలగించి సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

పూలే ఆశయాలను కొనసాగిస్తూ విద్య, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.