BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 03:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిరలో ఘనంగా దీనదయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 03:57 PM
17 వీక్షణలు

మధిర: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంత్యోదయమే లక్ష్యంగా, సమాజంలోని చివరి వ్యక్తి సంక్షేమమే దేశ అభివృద్ధికి కొలమానంగా భావించిన మహనీయుడు దీనదయాళ్ ఉపాధ్యాయ్ అని వక్తలు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, జాతీయత, మానవీయ విలువల ఆధారంగా దేశ నిర్మాణం జరగాలన్న ఆయన ఆలోచనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తి ముఖంలో చిరునవ్వు పూయించడమే నిజమైన అభివృద్ధి అనే అంత్యోదయ స్ఫూర్తితో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సంకల్పంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కార్యక్రమం

జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ నాయకులు మధిర పట్టణంలోని స్థానిక ఎస్సీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పోషకాహారాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారులతో చిత్రాలు గీయించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. చిన్నారులతో నాయకులు ఆప్యాయంగా ముచ్చటించారు.

మధిర పట్టణ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మర్సకట్ల స్వర్ణాకర్, బీజేపీ జిల్లా కార్యదర్శి రామిశెట్టి నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పాపట్ల రమేష్, సీనియర్ జిల్లా నాయకుడు చిలువేరు సాంబశివరావు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం భవాని, జిల్లా కార్యదర్శి దోర్నాల రవీంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ, మహిళా నాయకురాలు ఆలేటి మేరి తదితరులు పాల్గొన్నా