BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 05 October 2026, 10:28 am
Posted by : SEETHA KIRAN KUMAR

ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
05 Oct, 2026 - 10:28 AM
181 వీక్షణలు

హైదరాబాద్: సామాజిక న్యాయం, బీసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణతో పాటు జాతీయ జనగణనలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో తెలుసుకోవడం కేవలం గణాంకాల కోసం కాదని అన్నారు. జనాభా వివరాల ఆధారంగా బీసీలకు వారి హక్కులు, ప్రాతినిధ్యం, అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తగిన వాటా కల్పించేందుకు కులగణన అవసరమని పేర్కొన్నారు.


జాతీయ స్థాయిలో ఓబీసీ కులాల గణన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కులగణన ద్వారా బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం లభిస్తుందని, తదనుగుణంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

బీసీల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు అన్నారు. కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన బీసీలకు హక్కులు, అవకాశాలు, రాజకీయ మరియు సామాజిక ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం సాధించే వరకు తమ డిమాండ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.