BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:05 pm
Posted by : K MAHESH

రైతుల వ్యవసాయ బావుల్లో ఉపాధి హామీ నిధులతో పూడికతీత పనులు చేపట్టాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
19 Nov, 2026 - 07:05 PM
15 వీక్షణలు

రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్

గార్ల, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): రైతుల వ్యవసాయ బావుల్లో ఉపాధి హామీ పథకం కింద పూడికతీత పనులు చేపట్టి సాగునీటి వనరులను మెరుగుపరచాలని వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) జిల్లా అధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గార్ల మండల కేంద్రంలోని గిరిప్రసాద్ భవన్‌లో నిర్వహించిన మండల స్థాయి ప్రజా సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు, సాగు ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రైతులు తమ సొంత ఖర్చులతో వ్యవసాయ బావుల్లో పూడికతీత పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందన్నారు.

బావుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల వ్యవసాయ బావుల్లో పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.

ఈ పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలు చేస్తే రైతులకు సాగునీటి వనరులు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ కూలీలకు గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు వ్యవసాయానికి ఉపయోగపడే పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకొని బావుల్లో పూడికతీత పనులు ప్రారంభించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కట్టెబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాగం రమేష్, మేదరమెట్ల గిరిప్రసాద్, ధూపాటి జనార్ధన్, భుక్య హరినాయక్, రాగం సత్యం, ఇల్టూరి వెంకన్న, భూక్య శ్రీను, చౌకాల బిక్షం, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.