వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అర్చకుల క్వార్టర్స్ సమీపంలో రూ.4.80 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే కేశఖండనశాల ముందు భాగంలో రూ.4.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డును ప్రారంభించారు. నూతన కార్ పార్కింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షాపులు, జీఐ షెడ్లను కూడా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఆర్థి శ్రీరామచంద్రమూర్తి, పాలక మండలి సభ్యులు యల్లమిల్లి చంద్రకుమారి జగన్మోహన్, మాజీ సర్పంచ్ కాయల జగన్నాధం, ఏపుగంటి సుబ్బారావు, పెండెం వెంకన్న, ఎరుబండి రాజు, ఏపుగంటి వెంకటేష్, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.