BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:23 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ సమీపంలోని శ్రీ శివలింగయ్య ఆలయానికి భక్తుల తాకిడి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
09 Nov, 2026 - 12:23 PM
33 వీక్షణలు

శివుడికి మాంసాహారం, మద్యంతో ప్రత్యేక పూజలు.. ప్రతి సోమవారం శాకాహార అన్నదానం

ఆర్మూర్, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

ఆర్మూర్ సమీపంలోని శ్రీ శివలింగయ్య ఆలయం ప్రత్యేక ఆచారాలు, సంప్రదాయాలతో భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఈ ఆలయంలో శివుడికి మాంసాహారం, మద్యంతో పూజలు నిర్వహించడం ప్రత్యేకతగా కొనసాగుతోందని గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తుల మొక్కులలో భాగంగా కోళ్లు, మేకలను సమర్పించి తమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారని వివరించారు. స్వామివారి ఆశీస్సులతో తమకు మంచి జరిగిందనే నమ్మకంతో భక్తులు ఈ ఆచారాలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు ప్రతి సోమవారం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శివకుమార్ తెలిపారు. ఈ అన్నదానంలో భక్తులకు శాకాహార భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలతో ఆలయానికి పరిసర గ్రామాల నుంచి భక్తులు వస్తుంటారని ఆలయ వర్గాలు వెల్లడించాయి.