BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:10 pm
Posted by : K MAHESH

నెల్లికుదురులో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:10 PM
11 వీక్షణలు

ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలి: బీఆర్‌ఎస్ పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి వరిపల్లి వెంకటేష్

మహబూబాబాద్, నవంబర్ 09 (ఎన్ టుడే న్యూస్):

నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బీఆర్‌ఎస్ నెల్లికుదురు పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి వరిపల్లి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ప్రజలకు అవసరమైన సదుపాయాలపై మాట్లాడారు.

మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులు చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వెంకటేష్ పేర్కొన్నారు. తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు ప్రయాణ ఖర్చులు, సమయభారం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. స్థానికంగానే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కోరారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల ప్రజలకు మెరుగైన వైద్యం స్థానికంగానే అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

హామీలు కాదు.. ప్రజలకు వైద్యం కావాలి

ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వెంకటేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ప్రజారోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకొని నెల్లికుదురు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. మండల ప్రజలకు ఇచ్చిన హామీలను పాలకులు నెరవేర్చకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కారం ప్రశాంత్, ఏర్పుల సురేష్, నరెడ్ల ప్రవీణ్, ఏర్పుల సందీప్, ఏర్పుల ప్రభాకర్, పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు.