జనార్ధనవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను వీఆర్వో హరిబాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మాదాసు చిన్న పుల్లయ్య, కార్యదర్శి బలువురు రత్తయ్య, నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, బోరి గొర్ల తిరుపతిరావు, నడిపింటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాదాసు చంద్రకళ మాట్లాడుతూ గ్రామంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టాదారు పాస్ పుస్తకాలు పొందాల్సిన రైతులు వీఆర్వో హరిబాబును సంప్రదించి, అవసరమైన సంతకం చేసి తమ పాస్ పుస్తకాలను తీసుకెళ్లాలని సూచించారు. రైతులు తమ భూ సంబంధిత పత్రాలను సక్రమంగా పొందేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు.