హుస్సేన్‌పురంలో 150 మంది మహిళలకు చీరల పంపిణీ
వెలిగండ్ల, సెప్టెంబర్ 25: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ చిన్న కుమార్తె దద్దాల నిషిత పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి, మాజీ సర్పంచ్ దద్దాల మంజు భార్గవి శుక్రవారం సాయంత్రం వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సుమారు 150 మంది మహిళలకు చీరలను అందజేశారు. నిషిత పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో దద్దాల రాములు, వైస్ సర్పంచ్ ఏకుల ఆదిలక్ష్మి, కన్నాటి వెంకటరెడ్డి, తమ్మినేని శివరామిరెడ్డి, కర్నాటి ప్రభాకర్, తమ్మినేని గోవిందయ్య, ఉండేల మాలకొండయ్య, తమ్మినేని పెద్దిరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ఏకుల వెంకటేశ్వర్లు, పల్నాటి ఎల్లయ్య, పల్నాటి చిన్న ఎల్లయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.