అధిక వర్షాలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ఆంధ్రప్రదేశ్
/
తూర్పు గోదావరి
24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు.. ప్రజలకు తక్షణ సహాయం– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని స్థాయిల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లాలోని రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. కంట్రోల్ రూమ్‌లకు వచ్చే ఫోన్ కాల్స్‌ను సిబ్బంది నిరంతరం స్వీకరించి, ప్రజల నుంచి వచ్చే సమాచారం, ఫిర్యాదులు, అత్యవసర పరిస్థితులను సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లి తగిన సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాలు, వరదలు, రహదారులపై నీటి ప్రవాహం, చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు నేలకూలడం వంటి అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు తమ పరిధిలోని కంట్రోల్ రూమ్‌లకు తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు అవసరమైన సమాచారం, సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమైన కంట్రోల్ రూమ్ నంబర్లు:
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్:
08832-944455
రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్:
ఆర్డీవో, రాజమహేంద్రవరం – 08832-442344
బిక్కవోలు – 7702066689
కడియం – 9490884561
అనపర్తి – 9441386920
గోకవరం – 9491385060
రాజమహేంద్రవరం నగరం – 6303024240
సీతానగరం – 7032310130
కోరుకొండ – 9154474851
రాయవరం – 9618006344
కపిలేశ్వరపురం – 8855225457
రాజమహేంద్రవరం గ్రామీణం – 9966058666
మండపేట – 9989626869
రాజానగరం – 9030102674
కొవ్వూరు రెవెన్యూ డివిజన్:
ఆర్డీవో, కొవ్వూరు – 08813-231488
కొవ్వూరు – 9491041468
చాగల్లు – 9441293856
తాళ్లపూడి – 9491041469
దేవరపల్లి – 9491041478
గోపాలపురం – 9491041484
నల్లజర్ల – 9491041451
నిడదవోలు – 9491041470
పెరవలి – 9491041473
ఉండ్రాజవరం – 9491041474
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తమ పరిధిలోని కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించి సమాచారం అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. అందిన సమాచారంపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.