BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:31 am
Posted by : K MAHESH

చెన్నారెడ్డిగూడెంలో ఘనంగా మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:31 AM
24 వీక్షణలు

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తాం: సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 8 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం గ్రామంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంచాల వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్, గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్లకు నాయకులు, కమిటీ సభ్యులు వెళ్లారు. లబ్ధిదారులతో కలిసి వారి ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి దీపావళి వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ సమయంలో ఎదురైన సమస్యలు, ఇతర ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాణాసంచా కాల్చి పండుగ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను శాలువాలతో సత్కరించారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి

ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ జెనిగే వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి వారితో కలిసి పండుగ జరుపుకోవడం కార్యక్రమంలో ప్రత్యేకతగా నిలిచింది. గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంబోతు కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ముచ్చర్ల వెంకటేష్ యాదవ్, వార్డు సభ్యులు రత్నావత్ హర్యా నాయక్, కాట్రోత్ హర్యా, మంచర్ల క్రాంతి కుమార్, నెట్టు బౌరమ్మ, కాట్రోత్ మధు నాయక్, అంబోతు లావణ్య, మాజీ ఎంపీటీసీ లాలు నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎర్రమోని శ్రీశైలం, నెట్టు మంజుల, గ్యార రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పగడాల శ్రీశైలం, కార్యదర్శి రాజు, నాయకులు చీమల రమేష్, గ్యార పెంటయ్య, నెట్టు వెంకటయ్య, చీమల సురేష్ తదితరులు పాల్గొన్నారు.