BREAKING
thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు
Date of Publish : 04 October 2026, 10:01 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

ప్రజల మౌనాన్ని బలహీనతగా భావించొద్దు: పడాల శివారెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
04 Oct, 2026 - 10:01 PM
14 వీక్షణలు

పల్నాడు జిల్లా: ప్రజల మౌనాన్ని కూటమి ప్రభుత్వం బలహీనతగా భావించవద్దని, ప్రజా గళం గర్జిస్తే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి అన్నారు. రొంపిచర్లలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని శివారెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఎదురవుతున్న సమయంలో ‘ఆడబిడ్డ నిధి’, ‘నిరుద్యోగ భృతి’ వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. హామీల అమలు విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించేందుకు ‘సెల్ఫీ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజల సమస్యలపై వైఎస్సార్‌సీపీ తరఫున ఆందోళనలు చేపడతామని శివారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.