BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 05 October 2026, 10:04 pm
Posted by : MUSUGU GOPI

పెన్షన్ మంజూరు కోసం మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వొద్దు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
05 Oct, 2026 - 10:04 PM
15 వీక్షణలు

పల్నాడు: పెన్షన్ మంజూరు కోసం ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పల్నాడు జిల్లాలో మొత్తం 62,866 పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు కాగా, అందులో 7,311 మంది లబ్ధిదారుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 70 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా 55,485 మంది లబ్ధిదారుల వివరాలను రాష్ట్ర స్థాయిలోని సంబంధిత శాఖలకు పరిశీలన కోసం పంపినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. సంబంధిత శాఖల పరిశీలన అనంతరం అర్హత ఆధారంగా తదుపరి ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులు తమ దరఖాస్తు ఆమోదం కోసం ఎటువంటి మధ్యవర్తులు, ఇతర వ్యక్తులకు డబ్బులు ఇవ్వవద్దని కలెక్టర్ సూచించారు. పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినా, లేదా ఈ తరహా అక్రమాలకు ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిసినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

పెన్షన్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడే వారిపై నిబంధనల మేరకు కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండి, పెన్షన్ మంజూరు పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల మాటలను నమ్మవద్దని సూచించారు.