BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:09 pm
Posted by : K MAHESH

మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:09 PM
10 వీక్షణలు

డ్రగ్స్‌, గంజాయి, మద్యం, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి.. యువతకు ది మిషన్‌ ఫౌండర్‌, ఎక్సైజ్‌ సీఐ కొట్టే ఏడుకొండలు పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

డ్రగ్స్‌, గంజాయి, మద్యం, బెట్టింగ్‌ వంటి వ్యసనాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ది మిషన్‌ ఫౌండర్‌, ఎక్సైజ్‌ సీఐ కొట్టే ఏడుకొండలు యువతకు పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి సన్మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.

మునిపంపుల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్‌ శాఖ, ఎక్సైజ్‌ శాఖల సహకారంతో గ్రామ యువతకు మత్తు పదార్థాలు, ఇతర వ్యసనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. “హలో యువత.. ఎటువైపు నీ భవిత!” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొట్టే ఏడుకొండలు యువతను ఉద్దేశించి మాట్లాడారు.

యువత దేశానికి, సమాజానికి భవిష్యత్తు ఆశాకిరణాలని, అలాంటి యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ జీవితాలను అంధకారం చేసుకోవడం బాధాకరమని అన్నారు. డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ సంబంధాలు, సామాజిక బంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. వ్యసనాల బారిన పడకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రామన్నపేట ఎస్‌ఐ గోపతి సతీష్‌ మాట్లాడుతూ బెట్టింగ్‌, ఆన్‌లైన్‌ జూదం వంటి వ్యసనాలకు అలవాటుపడిన యువత ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలను, కుటుంబ సభ్యుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితానికి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడలు, సామాజిక సేవ వంటి నిర్మాణాత్మక కార్యక్రమాలపై యువత దృష్టి పెట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగం గురించి సమాచారం తెలిసినప్పుడు పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖల అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడుతూ గ్రామ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతోనే గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. యువత భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. మునిపంపుల గ్రామాన్ని మత్తు పదార్థాలు, బెట్టింగ్‌, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు.

వ్యసనాలను వీడుదాం.. జీవితాలను నిర్మించుకుందాం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పోటీ పడదాం అనే సందేశాన్ని యువతలోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ అరుణ్‌ కుమార్‌, గ్రామ ఉపసర్పంచ్‌ తాళ్ల క్రాంతి కుమార్‌, విఆర్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ రాంరెడ్డి, సామాజిక కార్యకర్త నీలం శేఖర్‌, ఉపాధ్యాయుడు కుక్కడపు రమేష్‌, పాలకవర్గ సభ్యులు యాదాసు లక్ష్మణ్‌, మేకల రాములు, కునూరు లక్ష్మమ్మ, గంటెపాక శ్రీను, మేకల జలేందర్‌, మాజీ ఎంపీటీసీ గాదె పారిజాత, గంటెపాక శివకుమార్‌, వేముల సైదులు, బూరుగు గోపికృష్ణ, తోలుపునూరి చంద్రశేఖర్‌, జితేందర్‌, ఉడుతల శ్రీనివాస్‌, ఏలూరి అనిత, బాదే మంజుల, యాదాసు శోభ, బూడిద మారయ్య, స్వామి నాయక్‌, నరసింహ, ప్రశాంత్‌, స్వామి, సైదులు తదితరులు పాల్గొన్నారు.