పోలు మల్లికార్జున రెడ్డి కి డాక్టర్ దద్దాల పరామర్శ
పామూరు మండలం, గోపాలపురం కు చెందిన వైయస్ఆర్ సీపీ నాయకులు పోలు మల్లికార్జున రెడ్డి గుండె సమస్య కారణంగా హార్ట్ స్టెంట్ ఆపరేషన్ చేపించుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. మంగళవారం మండల పార్టీ శ్రేణులతో కలిసి కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆయనను వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా గుండె చికిత్సకు సంబందించిన వివరాలు ఆరాతీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకొని పలు జాగ్రత్తలు సూచించి,త్వరగా కోలుకోవాలని దద్దాల నారాయణ యాదవ్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గంగసాని హుస్సేన్ రెడ్డి,కల్లూరి రామిరెడ్డి,గట్ల విజయభాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి,పల్నాటి భాస్కర్ రెడ్డి, చిలకల నారాయణరెడ్డి, శివకుమార్ రెడ్డి, గోడి నారాయణరెడ్డి, సైకం ఏడుకొండలు రెడ్డి, అబ్బారెడ్డి వెంకటేశ్వర్లు, అబ్బారెడ్డి వెంకటరత్నం, కోడూరు కృష్ణయ్య, కొండూరు వెంకటయ్య, చింతల నరసయ్య, పచ్చా శివ తదితరులు పాల్గొన్నారు...