BREAKING
thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు thumb ● 3 నెలల్లో 321 టన్నుల బంగారం కొనుగోలు thumb ● వృద్ధురాలితో సీఎం విజయ్‌ ఆత్మీయత.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు thumb ● ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ప్రతి నెలా హాజరు నమోదు తప్పనిసరి thumb ● సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు పట్టభద్రులు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి thumb ● నంద్యాలలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ముందంజ.. దాదాపు 1,500 ఓట్ల ఆధిక్యం thumb ● ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ ఆకస్మిక తనిఖీలు thumb ● భువనగిరి డివిజన్ ఆత్మ డైరెక్టర్‌గా రాచకొండ రమేష్ ఎంపిక thumb ● టీబీ నివారణ, నియంత్రణపై ఆరోగ్య సిబ్బందికి అవగాహన సమావేశం thumb ● పట్టభద్రులు అధ్యాపకులతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఆత్మీయ సమావేశం thumb ● కేబుల్ కోసం తవ్విన గుంతలో పడి ఆర్ఎంపీ వైద్యుడికి తీవ్ర గాయాలు
మంచి మాట
Date of Publish : 03 November 2026, 06:00 pm
Posted by : PAGADALA DEVAIAH

పాలమూరు బస్తీలో డ్రైనేజీ పైప్‌లైన్లు మార్చాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
03 Nov, 2026 - 06:00 PM
12 వీక్షణలు

ఎన్నికల హామీలను అమలు చేయాలి.. అర్హులకు పెన్షన్లు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి: సీపీఎం డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):

బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాలమూరు బస్తీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలను నాయకులు పరిశీలించారు.

పాత డ్రైనేజీ పైప్‌లైన్లతో ఇబ్బందులు

పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యుడు ఎం. దశరథ్ మాట్లాడుతూ.. పాలమూరు బస్తీలో అనేక సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన డ్రైనేజీ పైప్‌లైన్లు ప్రస్తుత జనాభా, అవసరాలకు సరిపోవడం లేదన్నారు. వారానికి రెండు, మూడు సార్లు డ్రైనేజీ పైప్‌లైన్లు నిండిపోయి మురుగునీరు బస్తీలోకి ప్రవహిస్తోందని తెలిపారు.

డ్రైనేజీ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సకాలంలో స్పందించడం లేదని విమర్శించారు. బస్తీ అవసరాలకు అనుగుణంగా పాత పైప్‌లైన్లను మార్చి, పెద్ద సామర్థ్యం కలిగిన కొత్త పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలి

బస్తీలో దోమల బెడద తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని దశరథ్ కోరారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆరు గ్యారంటీల హామీలు అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బస్తీలో అర్హులైన వితంతువులు, వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయాలని, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు.

పాల్గొన్న సీపీఎం నాయకులు

ఈ పాదయాత్రలో సీపీఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్. వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యుడు కే. రమేష్, నాయకులు మల్లయ్య, పెద్దయ్య, ఎల్లయ్య, రాజు, నరసింహ, పౌల్ తదితరులు పాల్గొన్నారు.