BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 08:27 pm
Posted by : K MAHESH

కృష్ణవేణి పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
07 Nov, 2026 - 08:27 PM
9 వీక్షణలు

కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని విద్యార్థులకు సూచన

రామన్నపేట (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 7:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దీపావళి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కాలుష్య రహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు.

పండుగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా టపాసుల వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పండుగ ఆనందాన్ని ఇతరులకు ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి హాని చేయకుండా జరుపుకోవాలని తెలిపారు.

అనంతరం విద్యార్థులు పాఠశాల మైదానంలో దీపావళి పండుగను ప్రతిబింబించేలా వివిధ ఆకారాలు, భంగిమల్లో వేడుకలు నిర్వహించారు. దీపాలతో పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బి. సురేష్, అకాడమీ డైరెక్టర్ జెవిఎన్ఎస్ మణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.