BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయచోటిలో ఎన్నికల వేళ ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 05:59 PM
15 వీక్షణలు

నామినేషన్ల తిరస్కరణ, దాడులు, అక్రమ కేసులపై శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు 

కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం బాధిత అభ్యర్థులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం.. ఎన్నికల సంఘం, కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదులు బెదిరింపులకు భయపడను.. ఊపిరి ఉన్నంతవరకు ప్రజల పక్షాన పోరాడుతా: గడికోట రాయచోటి: గ్రామస్థాయి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచేలా రాయచోటి నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేసిన అభ్యర్థుల పత్రాలను సరైన కారణాలు చూపకుండా తిరస్కరించడం, అధికారులపై ఒత్తిళ్లు తీసుకురావడం, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడటం, అక్రమ కేసులు నమోదు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలనుకునే అభ్యర్థులకు స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల్లో సరైన కారణాలు లేకుండా తిరస్కరించిన నామినేషన్లను పునఃపరిశీలించి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం బాధిత నామినేషన్ అభ్యర్థులతో కలిసి రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని వివరించి వినతిపత్రం అందజేశారు. నామినేషన్ల తిరస్కరణకు సంబంధించిన అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారం న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసే అభ్యర్థులను అడ్డుకోవడం, ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, న్యాయం కోసం అధికారులను ఆశ్రయించిన వారికి ఇబ్బందులు కలిగించడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తూ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. గ్రామాలవారీగా జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను సేకరించి ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందజేసినట్లు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి బాధిత అభ్యర్థికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బెదిరింపులు, కేసులతో తనను వెనక్కి తగ్గించలేరని, ఊపిరి ఉన్నంతవరకు ప్రజల హక్కుల కోసం పోరాడుతానని పేర్కొన్నారు. రౌడీయిజం, బెదిరింపుల మధ్య ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సమాన అవకాశం కల్పించాలని, నామినేషన్ల తిరస్కరణపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.