BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 03:21 pm
Posted by : KADARI RAMANA

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలి

తెలంగాణ
/ నిర్మల్
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
14 Nov, 2026 - 03:21 PM
14 వీక్షణలు

కొత్త పెన్షన్ల మంజూరుతో వృద్ధులకు ఊరట.. మిగిలిన అర్హుల సమస్యలను ప్రభుత్వం పునఃపరిశీలించాలి: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్: నగరంలోని ఎఫ్‌సీసీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు కొత్త పెన్షన్ల మంజూరుతో ఎంతో ఊరట లభించిందని అన్నారు. అయితే ఇంకా అనేకమంది అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందాల్సి ఉందని పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో పెన్షన్లు పొందలేకపోతున్న వారి సమస్యలను ప్రభుత్వం మరోసారి పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

కుటుంబంలో కారు ఉందని, కుమారుడికి ఉద్యోగం ఉందని వంటి కారణాలతో అర్హులైన వృద్ధులకు పెన్షన్లు నిరాకరించడం సరైన విధానం కాదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కుమారుడికి ఉద్యోగం ఉన్నంత మాత్రాన వృద్ధ తల్లిదండ్రుల అవసరాలన్నింటినీ అతనే చూసుకుంటున్నాడని భావించలేమని అన్నారు. అనేక కుటుంబాల్లో వృద్ధులు తమ వ్యక్తిగత అవసరాల కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్న అర్హుల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి అర్హుడికి పెన్షన్ అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారితో పాటు ఇంకా మంజూరు కాని అర్హులైన లబ్ధిదారుల సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, మేడిశెమ్మ రాజు, కౌన్సిలర్లు గంజి రాజు, విట్టర్ సాత్విక్, అర్జున్, ఈశ్వర్, మనిషా, శశాంక్, సురేందర్, నాయకులు జమాల్, అనిల్, హరీష్, నగర అధ్యక్షుడు సాయి భరత్, అధికరణం తదితరులు పాల్గొన్నారు.