రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలకు మార్గం సుగమం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని భారత్ పెట్రోలియం బంక్ సమీపంలో చిట్యాల–ఉరుమడ్ల ప్రధాన రహదారిపై భారీ చెట్టు అడ్డంగా పడటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డుపై చెట్టు పడిన విషయం తెలుసుకున్న గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము వెంటనే స్పందించారు. తన ఆధ్వర్యంలో చెట్టు, కొమ్మలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం రహదారిపై ఉన్న చెట్టు అవశేషాలను తొలగించి శుభ్రం చేయడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.
రహదారిపై చెట్టు పడిన వెంటనే స్పందించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తొలగింపు చర్యలు చేపట్టిన జన్నపాల రాము తదితరులను స్థానికులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జన్నపాల స్వామి, మంద స్వామి తదితరులు పాల్గొన్నారు.