జడ్పీటీసీల పదవీ విరమణ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు నియోజకవర్గ నాలుగు మండలాల జడ్పీటీసీల పదవీ విరమణ కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల జడ్పీటీసీల పదవీ విరమణ కార్యక్రమం బందరులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తి చేసుకున్న జడ్పీటీసీలను ఘనంగా సత్కరించి, వారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అభిమానులు పాల్గొని పదవీ విరమణ చేస్తున్న జడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. మండలాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో జడ్పీటీసీలు అందించిన సేవలను పలువురు కొనియాడారు.