BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 05:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్నాబ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర రైతాంగానికి తీవ్ర నష్టం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Sep, 2026 - 05:49 PM
9 వీక్షణలు

ఆర్నాబ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర రైతాంగానికి తీవ్ర నష్టం పంట నష్టాన్ని గ్రామాల వారీగా సర్వే చేసి పరిహారం అందించాలి: అఖిల భారత కిసాన్ మహాసభ కార్యదర్శి 

విజయవాడ: ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు, వరదల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అఖిల భారత కిసాన్ మహాసభ జాతీయ కార్యదర్శి డి. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటల నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి రైతులకు తక్షణమే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 23 అర్ధరాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజామున మధ్య కాళింగపట్నం సమీపంలో ఉత్తరాంధ్ర తీరాన్ని దాటింది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, గరిష్ఠంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి.

నిన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు అప్పులు చేసి, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఇప్పుడు వర్షాలు, గాలులు, వరదల కారణంగా దెబ్బతిన్నాయని హరినాథ్ తెలిపారు. అరటి, పత్తి, మిర్చి, కొబ్బరి, పెసరతో పాటు వరి, మొక్కజొన్న, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రాథమిక అంచనాల ప్రకారం 7,813 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 18 వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొన్నారు. ఇందులో 7,259 హెక్టార్ల వరి పంట నీట మునిగినట్లు అంచనా. సంతబొమ్మాళి, పోలాకి, జి.సిగడాం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో వరి పంటకు గణనీయమైన నష్టం నమోదైంది. మొక్కజొన్న, పత్తితో పాటు అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలకు సుమారు రూ.17.5 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.

పార్వతీపురం మన్యం జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటల్లోకి వర్షపు నీరు చేరింది. సీతంపేట, పాలకొండ, కురుపాం ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు సమాచారం.

వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయని హరినాథ్ తెలిపారు. గోదావరి కూడా ఉధృతంగా ప్రవహించిన పరిస్థితులు ఏర్పడ్డాయని, విజయవాడ వద్ద కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగిన పరిస్థితి కనిపించిందన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ భారీ వర్షాల ప్రభావంతో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారని హరినాథ్ పేర్కొన్నారు. పెదపాడు, నిడమర్రు, దెందులూరు ప్రాంతాల్లో వరి పంటలు నేలకొరిగినట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మున్నేరు వరదల ప్రభావంతో పెనుగంచిప్రోలు, నందిగామ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు, వరదలు, ఈదురుగాలుల ప్రభావం కనిపించిందని హరినాథ్ తెలిపారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని, విద్యుత్ సంబంధిత ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

వర్షాలు కరువు పరిస్థితులకు పూర్తిస్థాయి పరిష్కారం కాదని, గతంలో వర్షాభావంతో నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వామపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కరువు పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి అవసరమైన ఉపశమన చర్యలు చేపట్టాలని కోరాయి.

ప్రభుత్వం తక్షణమే గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా పంట నష్టాన్ని నమోదు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. ప్రతి రైతు సాగు చేసిన పంట, దెబ్బతిన్న విస్తీర్ణం, నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి పారదర్శకంగా పరిహారం అందించాలని కోరారు.

అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని హరినాథ్ సూచించారు. అఖిల భారత కిసాన్ మహాసభ ప్రతినిధులు కూడా జిల్లాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతుల నష్టాలపై నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని తెలిపారు.