ఉప్పల్లో పార్క్ చేసిన కారులో అగ్నిప్రమాదం
తెలంగాణ
/
హైదరాబాద్
ఉప్పల్: హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం 4:30 గంటల సమయంలో పార్క్ చేసి ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
కారులో మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో కారు ఇంజిన్ భాగం గణనీయంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.