BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 05:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చౌటుపల్లి–జి.కొత్తూరు రహదారిపై వరద నీరు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 05:04 PM
7 వీక్షణలు

చౌటుపల్లి–జి.కొత్తూరు రహదారిపై వరద నీరు జేసీబీతో చెత్త, చెట్ల కొమ్మల తొలగింపు.. రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోతోంది. చౌటుపల్లి–జి.కొత్తూరు మధ్య ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద ప్రవాహంతో కొట్టుకొచ్చిన చెట్ల కొమ్మలు, చెత్త రహదారి పక్కన ఉన్న చూరల్లో ఇరుక్కుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. దీంతో గ్రామ వీఆర్వో గోపాలకృష్ణ, స్థానిక టీడీపీ నాయకుడు నాగేంద్రరెడ్డి స్పందించి జేసీబీ యంత్రంతో చెట్ల కొమ్మలు, చెత్తను తొలగించే చర్యలు చేపట్టారు. రహదారిపై వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేసి ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు.