తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద నీరు.. 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి సుమారు 60 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు మరింత వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తమ్మిలేరు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు, లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.