BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 01:55 pm
Posted by : RAJU POTHULA

నందిపేటలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు!

తెలంగాణ
Reporter
Raju Pothula Nandipet Mandal
14 Nov, 2026 - 01:55 PM
27 వీక్షణలు
  • కుళ్లిన చికెన్, నాణ్యత లేని మాంసం స్వాధీనం..
  • లైసెన్సులు లేని హోటళ్ల గుర్తింపు.. పలు హోటళ్ల సీజ్

నందిపేట: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. నందిపేట మండల కేంద్రంలోని పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబా హోటళ్లపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

తనిఖీల్లో కొన్ని హోటళ్లకు అవసరమైన ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్ని హోటళ్లలో కుళ్లిన చికెన్, నాణ్యత లేని మాంసాన్ని నిల్వ ఉంచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని పారవేశారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహార పదార్థాల తయారీకి నిషేధిత రంగులు వినియోగించవద్దని, నాణ్యత లేని మాంసంతో వంటకాలు తయారు చేయవద్దని హోటల్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. వంటగదులు, ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాల్లో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, ప్రతి హోటల్ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన పలు హోటళ్లను సీజ్ చేసినట్లు సమాచారం.

ఈ తనిఖీల్లో నందిపేట ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ట్రైనీ కలెక్టర్ సురేష్ పాములారి, నిజామాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారి నవిత పాల్గొన్నారు.

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించడం హోటల్ నిర్వాహకుల బాధ్యత అని, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.