విదేశీ మద్యం ధరలు పెంపు.. ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు పెరుగుదల
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: రాష్ట్రంలో విదేశీ మద్యం ధరలను సగటున 6 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెరిగాయి. పెంచిన ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం విక్రయానికి అందుబాటులో ఉన్న 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెండర్ కమిటీ సమర్పించిన నివేదిక, సిఫారసులను పరిశీలించిన అనంతరం ధరల పెంపునకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
కొత్త ధరల అమలుతో ఆయా బ్రాండ్ల మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఏయే బ్రాండ్ల ధరలు ఎంత మేరకు పెరిగాయనే పూర్తి వివరాలు అధికారిక ధరల పట్టిక ద్వారా వెల్లడికానున్నాయి.