BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 05:58 pm
Posted by : PEDDABOINA SRIKANTH

ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
19 Nov, 2026 - 05:58 PM
18 వీక్షణలు

పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. విద్యార్థుల భవిష్యత్తుకు చేయూత

నడికుడ మండలం, నవంబర్ 19 (ఎన్ టుడే న్యూస్): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నడికుడ మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ‘ఆల్ ఇన్ వన్’ పుస్తకాలను పంపిణీ చేశారు. శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

మండల పరిధిలోని రాయపర్తి, వరికోల్, నార్లాపూర్, చర్లపల్లి, కౌకొండ, కంఠాత్మకూర్, నడికుడ గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందజేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థీ చదువుకు దూరం కాకూడదని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు దీటుగా రాణించాలనేదే ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోచంపల్లి ఫౌండేషన్ సభ్యులు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నడికుడ మండల యువజన విభాగ నాయకులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.