BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 08:05 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో పేదలకు 2-3 సెంట్ల ఉచిత ఇంటి స్థలాలు...

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Sep, 2026 - 08:05 AM
50 వీక్షణలు

ఏపీలో పేదలకు 2-3 సెంట్ల ఉచిత ఇంటి స్థలాలు.. భూసేకరణకు ప్రభుత్వం సిద్ధం

అమరావతి: రాష్ట్రంలో ఇల్లులేని పేద కుటుంబాలకు ఉచితంగా ఇంటి స్థలాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అర్హుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అక్టోబర్ నెలాఖరు నాటికి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, నవంబర్ నుంచి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.

ఇప్పటికే ఇల్లు లేదా ఇంటి స్థలం లేని నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాలు, పట్టణాల్లో అవసరమైన భూములను గుర్తించి, దశలవారీగా స్థలాల పంపిణీ చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఈ నిర్ణయంతో సొంత ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుందని భావిస్తున్నారు.