వినాయకుడి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధి పథంలో పయనం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
నకిరేకల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి విగ్రహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. నకిరేకల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మరింత ప్రగతి పథంలో ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించారు.
వినాయక చవితి సందర్భంగా ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించాలని వేముల వీరేశం సూచించారు. పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఐక్యతా భావంతో నిర్వహించుకోవాలని కోరారు.