ఏపీలో 807 మద్యం షాపులకు తాజా నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,650 మద్యం షాపుల రెన్యువల్‌కు అవకాశం కల్పించగా, ఇందులో 3,236 షాపులను ప్రస్తుత యజమానులు రెన్యువల్ చేసుకున్నారు. మరో 414 షాపులకు రెన్యువల్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గతంలో మిగిలిపోయిన షాపులను కలుపుకుని మొత్తం 807 మద్యం షాపులకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ షాపులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. అందిన దరఖాస్తులను అక్టోబర్ 3న పరిశీలించనున్నారు. అనంతరం అర్హత పొందిన దరఖాస్తుదారుల నుంచి అక్టోబర్ 5న లాటరీ నిర్వహించి షాపులను కేటాయించనున్నారు.