జైలర్‌గా పనిచేసిన జైలుకే ఖైదీగా
జాతీయం
జాతీయం
రాజస్థాన్‌లోని అజ్మేర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలను తన ఫ్లాట్ క్లీన్ చేయించడం కోసం బయటకు తీసుకెళ్లిన జైలర్ దివ్యా చౌదరి
సదరు మహిళా ఖైదీలు ఇద్దరూ హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తుండటంతో దివ్యా చౌదరిపై కేసు నమోదు
కోర్టు నుంచి ఎటువంటి అనుమతి లేకుండా, జైలు రికార్డుల్లో నమోదు చేయకుండా జులై 12న ఓ ప్రయివేటు వాహనంలో ఆ ఖైదీలను దివ్యా చౌదరి అజ్మేర్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లినట్టు గుర్తింపు
దీంతో జైలర్ దివ్యా చౌదరితోపాటు జైలుగార్డు సోనియా చౌదరిలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
అప్పటినుంచి పరారీలో ఉన్న ఆమెను బుధవారం అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచిన పోలీసులు
దీంతో తాను జైలర్‌గా పనిచేసిన జైలులోనే ఖైదీగా మారిన దివ్యా చౌదరి