BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 08:04 pm
Posted by : K MAHESH

సంస్థాన్ నారాయణపురంలోని పురాతన కట్టడాల పరిరక్షణకు నిధులు కేటాయించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
09 Nov, 2026 - 08:04 PM
34 వీక్షణలు

శిథిలావస్థకు చేరుతున్న చారిత్రక నిర్మాణాలకు మరమ్మతులు చేపట్టేందుకు అనుమతివ్వాలని కలెక్టర్‌కు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వినతి

సంస్థాన్ నారాయణపురం (ఎన్ టుడే న్యూస్):

సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేయడంతో పాటు, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు. గ్రామ చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్న పురాతన నిర్మాణాలు ప్రస్తుతం నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందని ఆమె వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంస్థాన్ నారాయణపురం గతంలో హైదరాబాద్ నిజాం ప్రభుత్వ ఆధీనంలోని జాగీర్ వ్యవస్థలో భాగంగా ఉండేదని, ఆ కాలంలో ఈ ప్రాంతంలో భారీ రాతి ప్రహరీ గోడలు, బురుజులు, రాజభవనాలు, రక్షణ ద్వారాలు నిర్మించినట్లు వివరించారు. 1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైనప్పటికీ, అప్పటి చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన పలు నిర్మాణాలు ఇప్పటికీ గ్రామంలో ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం గ్రామంలోని పురాతన ప్రధాన ద్వారాలు, ఫలకునామ భవనం నిర్వహణ లోపంతో దెబ్బతింటున్నాయని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సరైన సమయంలో మరమ్మతులు చేపట్టకపోతే ఈ చారిత్రక కట్టడాలు పూర్తిగా శిథిలమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నిర్మాణాలు కేవలం పాత భవనాలు మాత్రమే కాకుండా, ప్రాంత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఈ చారిత్రక వారసత్వాన్ని అందించాలంటే వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.

అందువల్ల పురాతన కట్టడాలకు మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత శాఖ ద్వారా అవసరమైన అనుమతులు ఇప్పించాలని, వాటి పరిరక్షణకు తగిన నిధులు మంజూరు చేయించాలని కలెక్టర్‌ను కోరారు. గ్రామ పాలకవర్గం తరఫున, సంస్థాన్ నారాయణపురం ప్రజల తరఫున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి తెలిపారు.