BREAKING
బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు
Date of Publish : 25 July 2026, 08:14 pm
Posted by : కూనురు మధు

​గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

తెలంగాణ
25 Jul, 2026 - 08:14 PM
102 వీక్షణలు

​గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు : 8 మంది అరెస్ట్, రూ.10 లక్షల సొత్తు స్వాధీనం   

ఒడిశా నుంచి గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తూ పట్టణంలోని యువతకు విక్రయిస్తున్న 8 మంది సభ్యుల అంతరాష్ట్ర ముఠాను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని, మరొక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నామని నల్గొండ డిఎస్పీ కె. శివరాం రెడ్డి తెలిపారు. ​శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ  ఈ సందర్భంగా ​డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్  ఆదేశాల మేరకు జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఈ క్రమంలో ఈ నెల 24న ఉదయం మునుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ స్థలంలో కొందరు గంజాయి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం మెరుపు దాడి చేసింది. పారిపోయేందుకు యత్నించిన నిందితులను చాకచక్యంగా పట్టుకున్నాం అని తెలిపారు.  అరెస్ట్ అయిన వారిలో A-1 గా కస్పరాజు నాగరాజు, A-2గా  గంటెకంపు మధు గతంలోనే 15 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరు సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేసిన బైక్‌లను ఒడిశాలోని ప్రధాన సరఫరాదారు మనుకర్ (A-5)కి ఇచ్చి, అక్కడ నుంచి గంజాయి, వీడ్ (హాష్) ఆయిల్ కొనుగోలు చేశారు. ఆ సరుకును నల్గొండకు తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి విద్యార్థులకు, యువతకు విక్రయిస్తున్నారు అని వెల్లడించారు.

నిందితుల నుంచి తమ వ్యాపారానికి అడ్డువస్తే బెదిరించేందుకు ఉంచిన ఒక డమ్మీ తుపాకీ, బటన్ చాకును కూడా స్వాధీనం చేసుకున్నాం అని డిఎస్పీ వివరించారు. ​నిందితుల నుండి పదిలక్షల విలువగల 5.6 కిలోలు గంజాయి

​వీడ్ (హాష్) ఆయిల్,  100 M,  5 బైక్‌లు ,  4 మొబైల్ ఫోన్లు, 1 డమ్మీ తుపాకీ, 1 బటన్ చాకు. స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ​ఈ ఘటనపై వన్ టౌన్ పీఎస్‌లో ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నామని, పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరైనా సమాచారం ఇస్తే డయల్ 100 కి తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డిఎస్పీ స్పష్టం చేశారు. ​ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐలు ముత్తయ్య, సంపత్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారని డిఎస్పీ తెలిపారు.