BREAKING
thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Date of Publish : 24 September 2026, 07:45 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భారీ వర్షాలకు గంపలగూడెం పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కూల్చివేత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 07:45 PM
5 వీక్షణలు

అదృష్టవశాత్తూ తప్పిన ప్రమాదం.. పక్కనే తహసీల్దార్ కార్యాలయం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో మండలంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షాల ధాటికి గంపలగూడెం పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ కూలిపోయింది. ఒక్కసారిగా ప్రహరీ గోడ కూలిపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ ఘటన సమయంలో గోడ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీస్ స్టేషన్ పక్కనే తహసీల్దార్ కార్యాలయం ఉండటంతో ప్రహరీ గోడ కూలిన ఘటన మరింత ఆందోళనకు గురిచేసింది. కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బంది రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో అప్రమత్తత అవసరమని స్థానికులు చెబుతున్నారు. గోడ కూలిన ప్రాంతంలో పరిస్థితిని అధికారులు పరిశీలించి, ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు గంపలగూడెం మండల వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పలు వాగులు, వంకలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై కూడా వరద నీరు ప్రవహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు మరింత కొనసాగితే పరిస్థితి తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు, కల్వర్టులు, వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని, చిన్నపిల్లలు, వృద్ధులు వరద ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ભારે వర్షాల నేపథ్యంలో గంపలగూడెం మండలంలో అధికార యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.