BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 25 September 2026, 06:37 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

మంచిర్యాలలో గణపతి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
25 Sep, 2026 - 06:37 PM
47 వీక్షణలు

శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

మంచిర్యాల: మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద మున్సిపల్ కార్పొరేషన్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నిమజ్జన శోభాయాత్రలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో తొమ్మిది రోజుల పాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించిన భక్తులు, ప్రజలు నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిమజ్జన వేడుకల్లో ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ, పరస్పరం సహకరించుకుంటూ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.

ఈసారి గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని గోదావరిఖని సమీపంలోని గోదావరిలో కాకుండా గూడెం వద్ద గోదావరిలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా గూడెం వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా పోలీసు, మున్సిపల్ అధికారులు భద్రత, ట్రాఫిక్, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షుడు పూద తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండ సుధాకర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.