BREAKING
thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● చిట్టీల డబ్బులతో కుటుంబంతో సహా వ్యక్తి పరారీపై ఆందోళన thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు
Date of Publish : 20 August 2026, 03:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గోమాత ప్రచారకుడు కాశీనాథ్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 03:09 PM
141 వీక్షణలు

పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో గురువారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో గోమాత ప్రచారకుడు కాశీనాథ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కాశీనాథ్‌కు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. అనంతరం నిర్వహించిన సభలో టిడిపి గ్రామ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు మాట్లాడుతూ హిందూ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. గోరక్షణ కోసం కృషి చేసే వారిని, గోమాత గొప్పతనాన్ని ప్రజలకు వివరించే వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞకృష్ణ మాట్లాడుతూ గోవు నుంచి లభించే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, గోమూత్రం, గోమయం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో మెట్టగుట్ట శేషాచల శ్రీనివాస స్వామి కమిటీ గౌరవ అధ్యక్షుడు యనమద్ది విజయకుమార్, మహిళా కమిటీ సభ్యురాలు పొనుగుపాటి రాధమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.