వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ
నారాయణపురం: మండలంలోని వావిళ్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడు గుండెపంగా చిన్నస్వామి తండ్రి గుండెపంగా చంద్రయ్య దశదినకర్మ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై చంద్రయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిన్నస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి, చంద్రయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతరాజు సరళ చంద్రయ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కోల మహేష్, మండల మీడియా కన్వీనర్ శ్రీరాముల రవి, వార్డు సభ్యుడు బొమ్మరగోని లక్ష్మయ్య, జక్కర్తి బాబు, సంతోష్, వినోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.