BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జి.కొండూరు ఎంపీపీగా గేరా అనిత.. వైస్ ఎంపీపీగా వి.అనురాధిక ఎన్నిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Nov, 2026 - 07:06 PM
19 వీక్షణలు

నూతన నాయకత్వానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అభినందనలు జి.కొండూరు మండల పరిషత్‌కు నూతన నాయకత్వం బాధ్యతలు చేపట్టింది. మండల పరిషత్ అధ్యక్షురాలిగా గేరా అనిత, ఉపాధ్యక్షురాలిగా వి.అనురాధిక బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు వారిని అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధులు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. జి.కొండూరు మండల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు సమాన ప్రాధాన్యతనిస్తూ తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేసి జి.కొండూరు మండల అభివృద్ధిలో తమదైన ముద్ర వేయాలని శుభాకాంక్షలు తెలిపారు.