BREAKING
thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక thumb ● ఆర్మూర్‌లో నవంబర్ 20న మంత్రి సీతక్క పర్యటన thumb ● ఈ నెల 20న పెర్కిట్‌లో శ్రీశ్రీ భీమన్న ఉత్సవ దర్బార్ thumb ● పులివెందుల పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి.... thumb ● ఆగడూరులో దాడి ఘటన స్థలాన్ని పరిశీలించిన బీటెక్ రవి thumb ● అర్హులైన పేదలకు చేయూత పెన్షన్లు.. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం thumb ● నాగార్జున పాఠశాలలో ఆత్మీయంగా అంతర్జాతీయ పురుషుల దినోత్సవ వేడుకలు thumb ● దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: డీఐజీని కోరిన బీటెక్ రవి thumb ● ఈశ్వరమ్మ 101వ జయంతి సందర్భంగా 101 చీరల పంపిణీ thumb ● తెలంగాణ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్ విడుదల thumb ● జాతీయస్థాయి స్పీడ్ హ్యాండ్‌బాల్ పోటీలకు క్రిష్ణవేణి విద్యార్థిని ఎంపిక
Test 4
Date of Publish : 19 November 2026, 04:52 pm
Posted by : KADARI RAMANA

గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ భవిష్ మిశ్రా

తెలంగాణ
/ నిర్మల్ / బాసర
Reporter
Kadari Ramana నిర్మల్ నియోజకవర్గం
19 Nov, 2026 - 04:52 PM
14 వీక్షణలు

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి

బాసర (ఎన్ టుడే న్యూస్):

గోదావరి నది పుష్కరాల నిర్వహణకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా ఆదేశించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.

గురువారం బాసర ఆలయ ఈవో కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల కోసం చేపట్టిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖాధిపతి తమ పరిధిలోని పనులను నిరంతరం పర్యవేక్షించాలని, నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. గోదావరి నదిలో ప్రస్తుత నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఫొటోల రూపంలో పంపించాలని ఆదేశించారు. పనులకు సంబంధించి అవసరమైన అనుమతులు, ప్రభుత్వపరమైన నిర్ణయాలు పెండింగ్‌లో ఉంటే వాటిని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ఆలయ నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే ప్రముఖుల వసతి కోసం చేపడుతున్న భవన నిర్మాణ పనులపై పలు సూచనలు చేశారు.

బాసరలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ నిర్మాణ పనులకు అనువైన ప్రభుత్వ భూములను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఇరిగేషన్ అధికారి అనిల్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, తహసీల్దార్ పవన్ చంద్ర, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.