BREAKING
thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి thumb ● ఎండిన చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపాలి thumb ● తొట్టంబేడు మండల అభివృద్ధికి కృషి చేస్తా: రావిళ్ల మునిరాజా నాయుడు thumb ● జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా దీపావళి జరుపుకోవాలి
Test 4
Date of Publish : 07 November 2026, 07:05 am
Posted by : P. KISHORE

గుంతలమయంగా గోపాలపురం–తాళంబేడు రహదారి

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
07 Nov, 2026 - 07:05 AM
48 వీక్షణలు

చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న రోడ్డు.. ద్విచక్ర వాహనదారులకు తప్పని ఇబ్బందులు

(ఎన్ టుడే న్యూస్): గోపాలపురం నుంచి తాళంబేడు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారి మొత్తం పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో చిన్నపాటి వర్షం కురిసినా వాటిలో నీరు నిలిచి చెరువులను తలపిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించడం మరింత కష్టంగా మారుతోందని పేర్కొంటున్నారు.

ఇదే మార్గంలో కంటైనర్లు, గ్రానైట్ లారీలు, జల్లీ ఫ్యాక్టరీలకు సంబంధించిన భారీ వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో రహదారిపై రవాణా ఒత్తిడి పెరుగుతోందని గ్రామస్తులు అంటున్నారు. భారీ వాహనాల రాకపోకల మధ్య గుంతలతో కూడిన రహదారిపై ద్విచక్ర వాహనదారులు ప్రయాణించాల్సి రావడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై సంబంధిత రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుంతలను తాత్కాలికంగా పూడ్చడమే కాకుండా, రహదారిని పూర్తిస్థాయిలో పునర్నిర్మించి ప్రయాణానికి అనువుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకుని గోపాలపురం–తాళంబేడు రహదారికి త్వరగా మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.