BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 04:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Nov, 2026 - 04:24 PM
67 వీక్షణలు

13,354 పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో షెడ్యూల్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 13న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ విడతకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 29న జరగనుంది. ఇక మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న విడుదల చేసి, డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి తొలి విడతకు ఈ నెల 17 చివరి తేదీగా నిర్ణయించారు. రెండో విడత నామినేషన్లకు ఈ నెల 20 చివరి గడువు కాగా, మూడో విడత నామినేషన్ల దాఖలుకు ఈ నెల 23 చివరి తేదీగా ప్రకటించారు. మూడు విడతల ఎన్నికలతో గ్రామ పంచాయతీల్లో రాజకీయ సందడి నెలకొననుండగా, ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.