ఊరుమడ్లలో ఘనంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
చిట్యాల, సెప్టెంబర్ 22: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో యంగ్ వింగ్స్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి మట్టిపల్లి నాగరాజు–సుగుణ, మట్టిపల్లి సత్తయ్య–సౌడమ్మ, మట్టిపల్లి పురుషోత్తం–అనిత దాతలుగా వ్యవహరించారు. గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
అన్నదానం అనంతరం గణేష్ లడ్డూ ప్రసాదం, ఇతర వస్తువుల వేలం నిర్వహించారు. వేలంలో పలువురు భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వేలం వివరాలు
- విఘ్నేశ్వర లడ్డూ: మట్టిపల్లి నాగరాజు — రూ.40,116
- శాలువా: నడింపల్లి వెంకటయ్య — రూ.13,116
- పెన్ను, డైరీ: మాధగోని రామకృష్ణ, నరేష్ (అంజయ్య కుమారుడు) — రూ.9,116
- వెండి కలశం (8 తులాలు): గుండెబోయిన శ్యాంసుందర్ — రూ.35,116
గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. అనంతరం గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యంగ్ వింగ్స్ యూత్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యంగ్ వింగ్స్ యూత్ సభ్యులు బోయ సైదులు, జాల వినోద్, అనంతుల మల్లేష్, జన్నపాల రాము, జె. స్వామి, జల సుమన్, రాచమల్ల నరేష్, బోయ జెమిని, ఎం. శ్రీకాంత్, కే. దుర్గరాజు, పి. నవీన్, సందీప్, ఆర్. రాకేష్, బొమ్మకంటి శివ, గుంటోజు రాజేష్, యద్దనపూరి సంతోష్, అంతటి వెంకటేష్, అవిశెట్టి మల్లేష్, ఇదుల పవన్, జి. శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.