BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 23 August 2026, 06:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:13 AM
72 వీక్షణలు

హైదరాబాద్‌ చందానగర్‌లో ఏసీబీ వల.. లంచం తీసుకుంటూ ఎస్సై బాలరాజు అరెస్ట్

చందానగర్: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ చందానగర్‌ ఎస్సై బాలరాజు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఓ భూ వివాదానికి సంబంధించి కేసు నమోదు చేసి, తదుపరి విచారణ పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై బాలరాజును అదుపులోకి తీసుకున్నారు.

ఎస్సై బాలరాజుతో పాటు కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌, స్టేషన్‌ రైటర్‌ రాఘవను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌లోనే వారిని అధికారులు విచారిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.