BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 29 August 2026, 11:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో అంబటి రాంబాబుకు గుండె చికిత్స....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Aug, 2026 - 11:09 AM
104 వీక్షణలు

హైదరాబాద్‌లో అంబటి రాంబాబుకు గుండె చికిత్స.. రెండు నాళాల్లో పూడిక గుర్తింపు

స్టెంట్‌ వేసిన వైద్యులు.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం

హైదరాబాద్‌: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అంబటి రాంబాబు గుండెకు సంబంధించిన రెండు రక్తనాళాల్లో పూడిక ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో వైద్యులు వెంటనే చికిత్స అందించి స్టెంట్‌ వేశారు.

ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలిసింది. ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.