BREAKING
thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● జిల్లా ఎస్పీ నుండి ప్రశంస పత్రం అందుకున్న రామన్నపేట ఎస్సై thumb ● గ్రామ అభివృద్ధి కోసం 371 గజాల సొంత స్థలం విరాళం thumb ● బతలూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.55 లక్షలతో సీసీ రోడ్లు thumb ● దుర్గామాత ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
Date of Publish : 29 August 2026, 11:08 am
Posted by : M. రాజశేఖర్

900 మంది విద్యార్థులతో అమ్మ భాష తెలుగు వినూత్న ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
29 Aug, 2026 - 11:08 AM
45 వీక్షణలు

900 మంది విద్యార్థులతో ‘అమ్మ భాష తెలుగు’ వినూత్న ప్రదర్శన

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కుప్పం నోబెల్ స్కూల్ వీడియో

కుప్పం | NTODAY News 

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని నోబెల్ స్కూల్లో 900 మంది విద్యార్థులతో నిర్వహించిన వినూత్న ప్రదర్శన ఆకట్టుకుంది. కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్) ఆధ్వర్యంలో విద్యార్థులు “అమ్మ భాష తెలుగు” అనే సందేశాన్ని వినూత్న రీతిలో ప్రదర్శించారు.

తెలుగు భాష గొప్పతనం, ప్రాధాన్యతను చాటిచెప్పేలా విద్యార్థులంతా సమన్వయంతో ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చేసిన ఈ ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో ఆసక్తి, అభిమానం పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.

వినూత్న రీతిలో తెలుగు భాష గొప్పతనాన్ని విద్యార్థుల ద్వారా ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని నోబెల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు మాతృభాషపై అభిమానం పెంపొందించే కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు.